← కీర్తనలు

899. ఈ తరం యువతరం

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఈ తరం యువతరం ప్రభుయేసుకే అంకితం నా బలం యవ్వనం - ప్రభుయేసుకే సొంతము అనుపల్లవి: రా సోదరీ రారా సోదరా - ప్రభుయేసు వార్తను చాటుదాం! రా సోదరీ రారా సోదరా - ప్రభుయేసు రాజ్యము స్థాపిద్దాం!!
1.  సువార్త సేవ నానాటికి చల్లారిపోయెగా ఆత్మల సంపద మరి ఎందుకో అడుగంటి పోయెగా దేవుని సేవా ... వ్యాపారమాయె - ఆత్మల రక్షణ ... నిర్లక్ష్యమాయె నీవు కాకపోతే ఇంకెవ్వరూ - నేడు కాకపోతే ఇంకెన్నడూ రా సోదరీ రారా సోదరా ప్రభుయేసు వార్తను చాటుదాం రా సోదరీ రారా సోదరా - ప్రభుయేసు రాజ్యము స్థాపిద్దాం ॥ఈ॥
2.  నశించిపోయే ఆత్మలు ఎన్నో అల్లాడుచుండెనుగా యేసయ్య ప్రేమ చాటించే సైన్యం బహు తక్కువాయెగా యేసయ్య రాకడ సమీపమాయె - ఆ వార్త చాటను వేగిర రావే నీవు కాకపోతే ఇంకెవ్వరూ - నేడు కాకపోతే ఇంకెన్నడూ రా సోదరీ రారా సోదరా ప్రభుయేసు వార్తను చాటుదాం రా సోదరీ రారా సోదరా - ప్రభుయేసు రాజ్యం స్థాపిద్దాం ॥ఈ॥