← కీర్తనలు

898. బ్రతకాలని ఉన్నా - బ్రతకలేకున్నా

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
బ్రతకాలని ఉన్నా - బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా - నిలవలేకున్నా చూడాలని ఉన్నా - చూడలేకున్నా చేరాలని ఉన్నా - నిను చేరలేకున్నా బ్రతికించుమో యేసయ్యా - దరి చేర్చుమో నన్నయ్యా
1.  కాపరిలేని గొఱ్ఱనైతి - కాటికి నే చేరువైతి కావలిలేని తోటనైతి - కారడవిగా నే మారితి గూడు చెదరిన గువ్వనైతి - గుండె పగిలిన ఏకాకినైతి గుండె దిగులుగా ఉందయ్యా - గూడు చేర్చుమో యేసయ్యా (2)
2.  నా ఆశలే అడియాశలై- అడుగంటెనే నా జీవితం శోధనల సుడివడిలో - తొట్రిల్లెనే నా పయనం చుక్కానిలేని నావనైతి - గమ్యము తెలియక అల్లాడుచుంటి గురి చేర్చుమో యేసయ్యా - నా గుండె గుడిలో నీవుండయ్యా (2)