← కీర్తనలు

900. నాకెన్నొ మేలులు చేసితివి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నాకెన్నొ మేలులు చేసితివి నీకేమి అర్పింతునూ దేవా నీకేమి చెల్లింతునూ - హల్లెలూయా యేసు నాథా కృతజ్ఞత స్తుతులివే ...
1.  కృపచేత నన్ను రక్షించినావు కృప వెంబడి కృపలో నను బలపరచితివే నన్నెంగానో ప్రేమించినావు నా పాపమును కడిగి పరిశుద్ధపరచితివే ॥నాకెన్నొ॥
2.  నాకిక ఆశలు లేవనుకొనగా నా ఆశ నీవైతివే ఆశలు తీర్చితివే, నలుదిశలు నన్ను భయమావరింప నా పక్షమందుంటివే నాకభయమిచ్చితివే ॥నాకెన్నొ
3.  నీ కాడి మోపి, నా తోడునీవై నీ చేతినీడలో నను దాచియుంచావు, ఏ కీడు నాకు రాకుండ జేసి నీ జాడలో నన్ను నడిపించుచున్నావే ॥నాకెన్నొ॥
4.  నీ రాజ్యమందు నను చేర్చుకొందువు రానున్న రారాజువు నా రాజువు నీవు, నీ వధువు సంఘమున నను జేర్చుకొన్నావు నన్ను కొన్నవాడవు నా వరుడవు నీవు ॥నాకెన్నొ॥