కీర్తనలు

896. నిను చూసే కన్నులు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నిను చూసే కన్నులు - నాకు ఇమ్మయ్యా నిను పిలిచే పెదవులు - ఇమ్ము యేసయ్యా (2) నిను చేరే పాదములు - నాకు ఇవ్వయ్యా నీ మాట వినే చెవులు - ఇమ్ము యేసయ్యా ॥నిను॥
1.  కన్నీటి ప్రార్థన - నాకు నేర్పయ్యా ఆత్మల సంపద - నాకు ఇవ్వయ్యా (2) నీ కొరకే జీవించే - సాక్షిగా మార్చయ్యా నాలోనే నిను చూపే - మాదిరి నివ్వయ్యా ॥నిను చూసే॥
2.  అందరితో సఖ్యత - ఇమ్ము యేసయ్యా మృదువైన మాటతీరు - నాకు ఇవ్వయ్యా 2) కోపతాపములను - దూరపరచయ్యా అందరినీ క్షమియించే - మనస్సు ఇవ్వయ్యా ॥నిను చూసే॥
3.  లోతైన ఆత్మీయత - నాకు ఇమ్మయ్యా లోబడుట నాకు - నేర్పు యేసయ్యా (2) లోపములన్ గ్రహించే - కృపను ఇమ్మయ్యా లోకాన్ని జయించే - జీవిత మివ్వయ్యా ॥నిను చూసే॥