← కీర్తనలు

895. చాలునయా చాలునయా

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
చాలునయా చాలునయా - నీ కృప నాకు చాలునయా ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు తల్లిగ లాలించి తండ్రిగ ప్రేమించి ప్రేమా కరుణా నీ కృప చాలు ॥చాలునయా॥
1.  జిగటగల ఊబిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా హిమముకంటెను తెల్లగ మార్చయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా నా జీవితమంత అర్పింతు నీకయ్యా ॥ప్రేమా॥
2.  బంధువులు స్నేహితులు త్రోసివేసినా తల్లిదండ్రులే నన్ను వెలివేసినా నన్ను నీవు విడువనె లేదయ్యా మిన్నగ ప్రేమించి రక్షించినావయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా నీ సాక్షిగా నేను ఇల జీవింతునయ్యా ॥ప్రేమా॥