కీర్తనలు

894. యేసయ్యా బంగారు యేసయ్యా

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసయ్యా బంగారు యేసయ్యా మా కంటి వెలుగై - మా ఇంటి వెలుగై మమ్ము నడిపించు – భారం నీదయ్యా ॥యేసయ్యా॥
1.  మా తల్లి తండ్రివి నీవేనయ్యా నీకన్న పెన్నిధి లేరెవ్వరూ మాతోడు నీడవై - మా అండదండవై మమ్ము నడిపించు భారం నీదయ్యా ॥యేసయ్యా॥
2.  ఎడబాయని నీ కృపలో - నడిపించినావా నా దేవా మాతోడు నీడవై - మా అండదండవై మమ్ము నడిపించు భారం నీదయ్యా ॥యేసయ్యా॥
3.  మాలోని జీవం నీవేనయ్యా మా జీవ మార్గం నీవేనయ్యా మాతోడు నీడవై - మా అండదండవై మమ్ము నడిపించు భారం నీదయ్యా ॥యేసయ్యా॥