కీర్తనలు

893. యేసయ్యా ... నిన్ను చూడాలని ఆశ

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసయ్యా ... నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా ... నిన్ను చేరాలని ఆశ (2) ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా (2) ॥యేసయ్యా॥
1.  అందరు ఉన్నారని అందరు నా వారని తలచితిని భ్రమసితిని – చివరికి ఒంటరి నేనైతిని నా గానం నీవయ్యా నా ధ్యానం నీవయ్యా నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీవయ్యా ॥యేసయ్యా॥
2.  అంధకారములో - అంధుడ నేనైతిని నిను చూచే నేత్రములు నా కొసగుమా నజరేయుడా నా ఆశ నీవయ్యా - నా ధ్యాస నీవయ్యా నా భాష నీవయ్యా - నా శ్వాస నీవయ్యా ॥యేసయ్యా॥