పల్లవి:
చిరకాల స్నేహితుడా - నా హృదయాన సన్నిహితుడా
నాతోడు నీవయ్యా - నీ స్నేహం చాలయ్యా
నా నీడ నీవయ్యా - ప్రియ ప్రభువా యేసయ్యా
అనుపల్లవి:
చిరకాల స్నేహం - ఇది నా యేసు స్నేహం(2)
1. బంధువులు వెలివేసిన - వెలివేయని స్నేహం
లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం - నా యేసు నీ స్నేహం ॥చిరకాల||
2. కష్టాలలో కన్నీళ్ళలో - నను మోయు నీ స్నేహం
నను ధైర్యపరచి ఆదరణ కలిగించు - నా యేసు నీ స్నేహం ||చిర||
3. నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం
కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం నా యేసు నీ స్నేహం ॥
