← కీర్తనలు

891. యెడబాయని నీ కృపలో

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యెడబాయని నీ కృపలో - నడిపించిన నా దేవా దయగల్గిన నీ ప్రేమలో - నను నిలిపిన నా ప్రభువా నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు ॥ యెడ॥
1.  నశించిపోయే నన్ను నీవు - ఎంతో ప్రేమతో ఆదరించి నిత్యములో నను నీ స్వాస్థ్యముగా - రక్షణ భాగ్యము నొసగితివే నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు ॥ యెడ॥
2.  నా భారములు నీవే భరించి నా నీడగ నాకు తోడైయుండి చెదరిన నా హృది బాధలన్నిటిని నాట్యముగానే మార్చితివే నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు ॥ యెడ॥
3.  అనుదినము నీ ఆత్మలోనే - ఆనంద మొసగిన నా దేవా ఆహా రక్షక నిన్ను స్తుతించెద - ఆనంద గీతము నే పాడి నీకేమి చెల్లింతు - నా ప్రాణమర్పింతు ॥యెడ||