కీర్తనలు

889. నీ నామం నా గానం

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నీ నామం నా గానం - నీ స్మరణే నా సర్వం (2) నా కాపరి నీవే యేసయ్యా నా ఊపిరి నీవే మెస్సయ్యా ... (2) ॥నీ నామం॥
1.  నీ వాక్యపు వెలుగులో నడిచెదనయ్యా నీ రక్షణ గూర్చి నేను పాడెదనయ్యా ఆ ... ఆ ... ఆ ... సంగీత స్వరములతో స్తుతియింతును పసససస! గరిసాస! సరిస! రిగరి! గమగ! మదప! దాదదదదా! నినినినిని! నిరిని! రిమద! పగరిస! స్తుతులందుకో నా యేసు రాజా ... ॥నీ నామం॥
2.  ఈ ఊపిరి నీ విచ్చిన కృపాదానమే నన్నిలలో కాపాడే కాపరి నీవే ఆ ... ఆ ... ఆ ... నీ ఆత్మతో నన్ను శృతి చేయుమయా పసససస! గరిసాస! సరిస! రిగరి! గమగ! మదప! దాదదదదా! నినినినిని! నిరిని! రిమద! పగరిస! బ్రతుకంత నీ సేవ చేసెదనయ్యా ... ॥నీ నామం॥