← కీర్తనలు

888. యేసు పాదాలనే కడగనా

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
పాదాలనే కడగనా - యేసు పాదాలనే కడగనా కన్నీటితో కడిగి - పన్నీరు పూయనా నన్నేలు స్వామికి నా జీవ నాధునికి ॥పాదాలనే॥
1.  నా పాప భారాన్ని మోసేందుకు ప్రభువు - నా కొరకు సిలువపై మరణించెను - నరకాగ్ని నుండి నన్ను రక్షించెను ఆ నరకాగ్ని నుండి నన్ రక్షించెను పరలోక సుఖములు నాకిచ్చెను ॥పాదాలనే॥
2.  పాపాల సుడిగాలి పాలైతిని కడకు శాపాల సంద్రములో పడిపోతిని నను తాను రక్షించి దరి చేర్చెను నూతన జీవితము నాకిచ్చెను ॥పాదాలనే॥