← కీర్తనలు

887. భారతదేశమా యేసుకే

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
భారతదేశమా యేసుకే నా భారతదేశమా ప్రియ యేసుకే (2) నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం(2) యేసు నామమే జయము జయమని - ఇహమంత మారుమ్రోగాలి పని చేయుచున్న సాతాను శక్తులు - పటాపంచలై పోవాలి (2) అనుపల్లవి: భారతదేశమా నా భారతదేశమా నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి భారతదేశమా నా భారతదేశమా ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి
1.  సృష్టికర్తనే మరచి భారతదేశమా సృష్టిని పూజించుట తగునా నా భారతదేశమా (2) ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా నిను రక్షించుటకు ప్రాణము పెట్టెను భారతదేశమా (2) భారతదేశమా యేసుని చేరుమా నూతన సృష్టిగా మార్చబడుదువు భారతదేశమా (2) ॥భారతదేశమా|| Jesus heal India, Jesus save India Jesus bless India, our India
2.  శాంతికి అధిపతి ఆ యేసే భారతదేశమా శాంతి రాజ్యమును స్థాపించును నా భారతదేశమా (2) లోకమంతయు లయమైపోవును భారతదేశమా లోకాశలన్నియు గతించిపోవును భారతదేశమా(2) భారతదేశమా యేసుని చేరుమా శాంతి సమాధానములను పొందుము భారతదేశమా (2) ॥భారతదేశమా||
3.  రాజుల రాజుగా మన యేసే భారతదేశమా పెండ్లి కుమారుడై రానుండే నా భారతదేశమా (2) యేసుని నమ్మిన దేశములన్నియు భారతదేశమా యేసుతోకూడా కొనిపోబడును భారతదేశమా (2) భారతదేశమా యేసుని చేరుమా సువర్ణ దేశముగా మార్చబడుదువు భారతదేశమా (2) ||భారతదేశమా||