← కీర్తనలు

886. ప్రభువా కాచితివి ఇంత కాలం

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ప్రభువా కాచితివి ఇంత కాలం కాచితివి ఇంత కాలం చావైన బ్రతుకైన నీ కొరకే దేవా నీ సాక్షిగా నేను జీవింతునయ్యా ॥ప్రభువా॥
1.  కోరి వెదికావు నా బ్రతుకు మలిచావయ్యా మరణ ఛాయలన్నిటిని విరిచావయ్యా నన్ను తలచావులే మరి పిలిచావులే అరచేతుల్లో నను చెక్కుకున్నావులే ॥ప్రభువా॥
2.  నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా మనిషిగ పుట్టిన సర్పాన్నయ్యా పాపం కడిగావులే విషము విరిచావులే నను మనిషిగ ఇల నీవు నిలిపావులే ॥ప్రభువా॥
3.  బాధలు బాపితివి నీవేనయ్యా కన్నీరు తుడిచితివి నీవేనయ్యా నను దీవించావులే పోషించావులే నీ కౌగిలిలో నను పెంచుకున్నావులే ॥ప్రభువా॥
4.  నా బాధలో నీవు నిలిచావయ్యా నీ వాడిగా నన్ను చేసావయ్యా నన్ను పిలిచావయ్యా చేయి చాపావయ్యా నీ కృపలోనే నన్ను కాపాడయ్యా ||ప్రభువా॥