← కీర్తనలు

885. నశియించు ఆత్మలెన్నియో

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నశియించు ఆత్మలెన్నియో - చేజారి పోవుచుండగా పరితాప మొందెనేసు - ప్రియమార నిన్ను పిలువ పరికించుమయ్యా సోదరా ఓ.. ఓ.. ఓ..
1.  నీ పాప భారమంతా - ప్రభుయేసు మోసెగా నీ పాప గాయములను - ఆ యేసు మాన్పెగా అసమానమైన ప్రేమ ఘనుమా ఈ సువార్తను(2) లోకాన చాటగా - లోకాన చాటగా (2) ॥నశియించు॥
2.  ఈ లోక భోగము నీకేల సోదరా నీ పరుగు పందెమందు - గురి యేసుడే కదా ప్రభు యేసునందే శక్తినొంది సాగుటే కదా(2) ప్రియ యేసు కోరెను - ప్రియ యేసు కోరెను (2) ॥నశియించు॥