← కీర్తనలు

884. నజరేతువాడా యూదుల రాజా

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నజరేతువాడా యూదుల రాజా- ఇమ్మానుయేల్ ప్రభు నీకే స్తోత్రం అబ్రాహాము దేవా ఇస్సాకు దేవా- యాకోబు దేవా నీకే స్తోత్రం
1.  పాపము చేసిన నరునికి రక్షణకోసం పరమును వీడి మరియ తనయుడిగ పశుల పాకలో బాలుడు యేసుగ పుట్టి సిలువను భుజమున మోసియు మరణముపై విజయము ప్రకటించి యేసు నీ ... ప్రేమా - యేసు నీ కరుణా యేసు నీ ... త్యాగం - యేసు ఈ మహిమా నీకే ... నీకే ... నీకే చెల్లును ఆ ... హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) ॥నజరేతువాడా॥
2.  ఎన్నో సూచక క్రియలు మాకై చేసి శిష్యులను పిలచి సర్వ సత్యములో నడుపగ నీ ఆత్మ మాపై పంపి రెండో రాకలో నమ్మిన వారల నెత్తబడే ఆకర్షణలో యేసు నీ ... ప్రేమా - యేసు నీ కరుణా యేసు నీ ... త్యాగం - యేసు ఈ మహిమా నీకే ... నీకే ... నీకే చెల్లును ఆ ... హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) ॥నజరేతువాడా॥