కీర్తనలు

882. దినమెల్ల నే పాడినా కీర్తించినా

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
దినమెల్ల నే పాడినా కీర్తించినా - నీ ఋణము నే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగా - నే ఇలలో జీవించనా(2)
1.  గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా - ఆకలైన వేళలో ఆహారమిచ్చి - నన్ను పోషించినావు దేవా నిను విడువనూ ... ఎడబాయననినా ... (2) నా యేసయ్యా ॥ది॥
2.  నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్ - వెనుకున్నవి మరచి ముందున్నవాటికై - సహనముతో పరుగెత్తెదన్ ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము (2) నేను పొందాలని ||ది॥