← కీర్తనలు

881. తూర్పు దిక్కు చుక్క బుట్టె

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
తూర్పు దిక్కు చుక్క బుట్టె - మేరమ్మ ఓ మరియమ్మ చుక్కను చూచి మేము వచ్చినాము - మ్రొక్కిపోవుటకు (2)
1.  యెరూషలేము పురము జేర వచ్చినాము - హేరోదు నొద్దకు ఎక్కడ లేడని అడిగినాము - మనవి చేసినాము ॥తూర్పు॥
2.  పండిత శాస్త్రులనెల్ల పిలచినారు - వారు వచ్చినారు పూర్వ వేదంబులను తెచ్చినారు - తేరి వెదకినారు ॥తూర్పు||
3.  బేత్లహేము పురములోని బాలుడమ్మా - గొప్ప బాలుడమ్మా బీదకన్య గర్భమందు బుట్టెనంచు - వారు నుడివిరమ్మా ॥తూర్పు||
4.  పశువుల పాకలోన బాలుడమ్మా పాప రహితుడమ్మా పాపంబు బాపను బుట్టెనమ్మా - సత్యవంతుడమ్మా ||తూర్పు||
5.  బంగారు సాంబ్రాణి బోళం దెచ్చినారు - బాలయేసు నొద్దకు బంగారు పాదముల మ్రొక్కినారు - బహుగా వేడినారు ॥తూర్పు॥