← కీర్తనలు

879. తడిమి చూస్తే ఏశావు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
తడిమి చూస్తే ఏశావు - స్వరము వింటే యాకోబు నిను తడిమి చూస్తే అన్యుడవు - నీ స్వరము వింటే క్రైస్తవుండవు అనుపల్లవి: వేషధారీ ఓ వేషధారీ- నీ బ్రతుకంతా మార్చుకో ॥తడిమి॥
1.  సున్నము కొట్టిన సమాధిలా ఉంటివా పైన తెలుపేగానీ లోపలంత కుళ్ళు నీ బ్రతుకంతా అలాగున్నదా - ఆచారాలకు బానిసైతివా ॥తడిమి॥
2.  ఏపుగా ఉన్నది అంజూరపు చెట్టు - పైకి పచ్చదనమేగానీ ఫలము శూన్యము (2) నీవుకూడా అలాగుంటివా - ఆత్మ ఫలములు కాయకుంటివా (2) ॥తడిమి॥
3.  అబషాలోము చూడు పైకి ఎంతో సుందరుడు - హృదయమెంతో నిండు కుట్ర కుతంత్రలతో (2) నీవు కూడా మోసంతోను నీ బ్రతుకంతా గడుపుచుంటివా (2) ॥తడిమి॥
4.  ఎన్నాళ్ళు వేషధారిగుందువు – ఎన్నాళ్ళు క్రీస్తును శిలు వేతువు (2) నేడే రక్షణ - దినమని ఎరుగుమా – నేడే క్రీస్తుని వెంబడింపుమ (2) ॥తడిమి॥