← కీర్తనలు

878. జీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
జీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా ఇవి మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా (2) ॥జీవిత॥
1.  నమ్ముకున్నాడు యోసేపు - అమ్ముకున్నారు అన్నలూ నమ్ముకున్నాడు ఏశావు - మోసగించాడు యాకోబు (2) నీ అన్నల నమ్మేకంటే....... నీ అన్నల నమ్మేకంటే - అన్న యేసునే నమ్ముకో రాజ్యము నీదే యేలుకో - పరలోకం నీదే యేలుకో ॥జీవిత॥
2.  నమ్ముకున్నాడు యేసయ్యా - అమ్ముకున్నాడు శిష్యుడు = పాపుల కొరకై వచ్చాడమ్మా - ప్రాణాలే తీసారమ్మా (2) ఈ మనుషులలోనే...... ఈ మనుషులలోనే మమతలు లేవు- మంచితనానికి రోజులు లేవు సమయము మనకు లేదమ్మా - యిక త్వరపడి యేసును చేరమ్మా ॥జీవిత॥
3.  నమ్మకమైనవాడు - ఉన్నాడు మన దేవుడు = నమ్మదగినవాడు - వస్తాడు త్వరలోనే (2) ఆ యేసుని రాకముందే...... ఆ యేసుని రాకముందే - మారుమనస్సు పొందుమా ప్రభువు చెంతకు చేరుమా - నీవు రక్షణ భాగ్యం పొందుమా ॥జీవిత॥