పల్లవి:
జయశీలుడా మా యేసయ్యా - జీవించువాడా మెస్సయ్యా (2)
జయమిచ్చువాడా స్తోత్రము- మా ప్రాణ ప్రియుడా వందనం (2)
ఆ. . ఆ. . ఆ. . ఆ. . హల్లెలుయా (2) ఆ. . హల్లెలూయా
1. బలమిచ్చువాడా బలవంతుడా - శక్తినిచ్చువాడా శక్తిమంతుడా
తృప్తినిచ్చువాడా తనయులకు - ముక్తినిచ్చువాడా మృత్యుంజయుడా
మాకై మరలా రానుంటివా (యేసు) (2) ||జయ||
2. ఆదియు అంతము నీవేగా - ఆరాధ్యుండవు నీవేగా
అత్యున్నతుడా అతి ప్రియుడా - ఆత్మస్వరూపీ ఆశ్రయుడా
అనుక్షణం నిన్నే కీర్తింతును ... (యేసు) (2) ॥జయ॥
3. నీవే దిక్కని నమ్మితిమి నిన్నే గురిగా ఎంచితిమి
నీవే మాకు తండ్రివి - నీకు సమస్తము సాధ్యమే
నీపై సర్వం మోపితిమి (యేసు) (2) |॥జయ॥
