← కీర్తనలు

876. గాలి సముద్రపు అలలకు నేను

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి యుండినపుడు (2) ఆదరించెనే నీ వాక్యము - లేవనెత్తేను నీ హస్తము హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2)
1.  శ్రమలలో నీవు నాకు తోడైయుంటివి - మొరపెట్టగా నా మొర వింటివి ఆదుకొంటివి నన్నాదుకొంటివి - నీ కృపతో నన్ను బ్రోచితివి ||హల్లెలూయ॥
2.  వ్యాధులలో నిన్ను వేడుకొనగా - ఆపదలలో నిన్ను ఆశ్రయించగా చూపితివి నీ మహిమ నాకు - కొనియాడెదము ప్రియ యేసుని ||హల్లెలూయ॥
3.  నీ తట్టు రమ్మని పిలిచితివి - నేను నీకు తోడుగా ఉన్నానంటివి (2) నిన్ను నేను ఆత్మలో కలుసుకొంటిని - నీవే నా సర్వమని ఎరిగితిని ||హల్లెలూయ॥
గాలి సముద్రపు అలలకు నేను - కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు (2) ఆదరించెనూ నీ వాక్యము - లేవనెత్తెనూ నీ హస్తము (2) హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2)
1.  శ్రమలలో నాకు తోడుంటివి - మొర్రపెట్టగా నా మొర్ర వింటివి (2) ఆదుకొంటివి నన్నాదుకొంటివి (2) నీ కృపలో నను బ్రోచితివి (2)
2.  వ్యాధులలో నీకు మొర్రపెట్టగా - ఆపదలలో నిన్ను ఆశ్రయించగా (2) చూపితివి నీ మహిమన్ (2) కొనియాడెదను ప్రభుయేసుని (2)
గానం సూచన
మూల పాఠ్యంలో కొన్ని పాదాలకు ప్రత్యామ్నాయ పదబంధాలు మరియు ||గాలి|| / ||హల్లెలూయ॥ అనే ప్రత్యామ్నాయ refrain సూచనలు కూడా ఉన్నాయి.