పల్లవి: మొదటి విధానం
ఎవరికోసమో ఈ ప్రాణ త్యాగం
ఎందుకోసమో ఈ సిలువయాగము(2) ||ఎవరి||
1. యూదులు పెట్టిన బాధకు నీవు తల్లడిల్లావా?
యేసు సొమ్మసిల్లావా? (2)
ముళ్ళమకుటం తలపై పెట్టి ముఖమున ఊశారా?
నిన్ను హేళన చేశారా? ||ఎవరి||
2. నిర్దయతో నీ కాలు చేతులలో చీలలు గుచ్చారా?
కొయ్య సిలువకు కొట్టారా? (2)
నేయబడిన అంగీ కొరకు చీట్లు వేశారా?
జూదమాడారా? |ఎవరి||
పల్లవి: రెండవ విధానం
ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము (2)
నీ కోసమే నా కోసమే
కలువరి పయనం – ఈ కలువరి పయనం (2) ||ఎవరి||
1. ఏ పాపము ఎరుగని నీకు – ఈ పాప లోకమే సిలువ వేసిందా
ఏ నేరము తెలియని నీకు – అన్యాయపు తీర్పునే ఇచ్చిందా (2)
మోయలేని మ్రానుతో మోముపైన ఉమ్ములతో
నడువలేని నడకలతో తడబడుతూ పోయావా
సోలి వాలి పోయావా…. ||ఎవరి||
2. జీవకిరీటం మాకు ఇచ్చావు – ముళ్ళ కిరీటం నీకు పెట్టాము
జీవ జలములు మాకు ఇచ్చావు – చేదు చిరకను నీకు ఇచ్చాము (2)
మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా
నీ ప్రక్కలో బళ్ళెముతో – ఒక్క పోటు పొడిచితిమి
తండ్రీ వీరు చేయునదేదో వీరెరుగరు
వీరిని క్షమించు, వీరిని క్షమించు
అని వేడుకొన్నావా… పరమ తండ్రిని ||ఎవరి||
