← కీర్తనలు

873. ఎంత మంచి దేవుడవయ్యా

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన (2) నా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన (2)
1.  సంతోషం ఎక్కడ ఉందనీ - సమాధానం ఎచ్చట నాకు దొరికేననీ (2) జగమంతా వెదికాను - జనులందరి నడిగాను (2) చివరికది నీలోనే కనుగొన్నాను (2) ||ఎంత మంచి||
2.  ప్రేమనేది ఎక్కడ ఉందనీ - క్షమనేది ఎచ్చట నాకు దొరికేననీ (2) బంధువులలో వెదికాను - స్నేహితులను అడిగాను (2) చివరికది నీలోనే కనుగొన్నాను (2) ||ఎంత మంచి||
3.  సత్యమనేది ఎక్కడ ఉందనీ - నిత్యజీవం ఎచ్చట నాకు దొరికేననీ (2) ఎందరికో మొక్కాను - ఏవేవో చేసాను (2) చివరికది నీలోనే కనుగొన్నాను (2) ||ఎంత మంచి||
4.  నెమ్మదనేది ఎక్కడ ఉందనీ - శాంతమనేది ఎచ్చట నాకు దొరికేనని (2) దిశలెన్నో తిరిగాను - యాత్రలెన్నో చేశాను (2) చివరికది నీలోనే కనుగొన్నాను (2) ||ఎంత మంచి||
ఎంత మంచి దేవుడవయ్యా - ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా - ఎంత మంచి దేవుడవేసయ్యా (2) ||ఎంత||
1.  ఘోరపాపినైన నేనూ – దూరంగా పారిపోగా (2) నీ ప్రేమతో నను క్షమియించి - నను హత్తుకొన్నావయ్యా (2) ||ఎంత||
2.  నాకున్న వారందరూ – నను విడచిపోయిననూ (2) ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ - నను నీవు విడువలేదయ్యా (2) ||ఎంత||
3.  నీవు లేకుండ నేనూ – ఈ లోకంలో బ్రతుకలేనయ్యా (2) నీతో కూడా ఈ లోకం నుండీ - పరలోకం చేరెదనేసయ్యా (2) ||ఎంత||