← కీర్తనలు

872. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఎంత దీనాతి దీనమో (2) ఓ యేసయ్యా - నీ జనన మెంత దయనీయమో తలచుకుంటె నా గుండె తడబడికరిగి కరిగి నీరగుచున్నది ఎంత దీనాతి దీనమో - ఓ యేసయ్యా నీ జనన మెంత దయనీయమో తలచుకుంటె నా గుండె తడబడి - కరిగి కరిగి నీరగుచున్నది
1.  నీ సృష్టిలో ఈ లోకమే - నీవు మాకు ఇచ్చినా సత్రమయ్యా (2) ఆ సత్రములో ఓ యేసయ్యా - నీకు స్థలమే దొరకలేదయ్యా (2) ||ఎంత||
2.  నిండు చూలాలు మరియమ్మ తల్లి నడువలేక సుడివడి పోయేనయ్యా (2) దిక్కు తోచక ఓ యేసయ్యా - పశువుల పాకలో ప్రసవించెనయ్యా (2) ||ఎంత||
3.  చల్లగాలిలో చాటు లేక - నలుమూలలా చలిపుట్టెనయ్యా (2) పసికందువై ఓ యేసయ్యా - తల్లి ఒడిలో ఒదిగి నావయ్యా (2) ||ఎంత||