871. ఎటు చూసినా యుద్ధ సమాచారాలు

పల్లవి:ఎటు చూచినా యుద్ధ సమాచారాలు - ఎటు చూచినా కరువూ భూకంపాలు
ఎటు చూచినా దోపిడీ దౌర్జన్యాలు - ఎటు చూచినా ఎన్నో అత్యాచారాలు
ఓ సోదరా ఓ సోదరీ (2)
రాకడ గురుతులని తెలుసుకోవా - తినుటకు త్రాగుటకు ఇది సమయమా
1. మందసము నీ ప్రజలు – గుడారములో నివసిస్తుండగ
యోవాబుని సేవకులు దండులో నుండగను (2)
తినుటకు త్రాగుటకు భార్యతో నుండుటకు (2)
ఇది సమయమా.. ఇది సమయమా.. అని
ఆనాడు ఊరియా దావీదునడిగాడు
ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు
||ఎటు||
2. ద్రవ్యము వస్త్రములు - ఓలీవ తోటలను
ద్రాక్షా తోటలను - ఎడ్లను గొట్టెలను (2)
దాసదాసీలను - సంపాదించుకొనుటకును (2)
ఇది సమయమా - ఇది సమయమాయని
ఆనాడు ఏలీషా - గేహజీని అడిగాడు
ఈనాడు నిన్నుకూడా - ప్రభువడుగుచున్నాడు
||ఎటు||
3. నా పితరుల యొక్క – సమాధులుండు పట్టణము
పాడైపోయెను పాడైపోయెను (2)
యెరూషలేము గుమ్మములు అగ్ని చేత కాల్చబడగా (2)
సంతోషముగ నుండుటకు ఇది సమయమా.. అని
ఆనాడు నెహెమ్యా పర రాజునడిగాడు
ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు
||ఎటు||
4. ఈనాడు దేశంలో ఎన్నో ఎన్నో దౌర్జన్యాలు
సజీవ దహనాలు స్త్రీల మానభంగాలు (2)
ఎన్నో గుడులు నేల మట్టం చేయబడుచుండగా (2)
తినుటకు త్రాగుటకు ఇది సమయమా అని
నీ సృష్టికర్తగు యేసు నిన్ను అడుగుచున్నాడు
ఈనాడు దేశం కొరకు ప్రార్ధించమన్నాడు
||ఎటు||