← కీర్తనలు

869. ఇంతకాలం నీదు కృపలో

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఇంత కాలం నీదు కృపలో - కాచిన దేవా (2) ఇకను కూడా మాకు తోడు - నీడ నీవే కదా (2) ||ఇంత కాలం||
1.  ఎన్ని ఏళ్ళు గడచినా - ఎన్ని తరాలు మారినా (2) మారని వీడని ప్రేమే నీదయ్యా - మార్చిన నా జీవితం నీకే యేసయ్యా (2) ||ఇంత కాలం||
2.  నీవు చేసిన మేలులు - తలచుకుందును అనుదినం (2) నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా - వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా (2) ||ఇంత కాలం||
3.  దూరమైతిరి ఆప్తులు - విడచిపోతిరి నా హితులు (2) శోధన వేదన తీర్చిన యేసయ్యా - తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా (2) ||ఇంత కాలం||