← కీర్తనలు

868. హల్లెలూయ స్తుతి మహిమ

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
హల్లెలుయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము ఆ.... హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా
1.  అలసైన్యములకు అధిపతియైన ఆ దేవుని స్తుతించెదము (2) అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లెలూయ||
2.  ఆకాశమునుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము (2) బండనుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లెలూయ||
3.  మన ఊహకుమించిన మేలులు చేసెడి దేవుని స్తుతించెదము (2) అడిగినవారి అక్కర తీర్చే దేవుని స్తుతించెదము (2) ||హల్లెలూయ||
4.  నీటిని ద్రాక్షా రసముగా మార్చిన దేవుని స్తుతించెదము (2) రోగము నుండి విడుదలనిచ్చే దేవుని స్తుతించెదము (2)
5.  మనకై రక్తము కార్చిన దేవుని మరువక స్తుతించెదము (2) పరిశుద్ధులుగా మనలను చేసిన మన దేవుని స్తుతించెదము 2) ||హల్లెలూయ||
6.  మనలను కొనిపోవ త్వరలో రానున్న దేవుని స్తుతించెదము (2) పరలోకమునకు చేరేంతవరకు మన దేవుని స్తుతించెదము (2) ||హల్లెలూయ||