← కీర్తనలు

867. ఆకాశమందున్న ఆసీనుడ

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఆకాశమందున్న ఆసీనుడా - నీ తట్టు కన్నులెత్తుచున్నాను నేను నీ తట్టు కన్నులెత్తుచున్నాను ॥ఆకాశ||
1.  దారి తప్పిన గొట్టెను నేను - దారి కానక తిరుగుచున్నాను కరుణించుమా యేసు కాపాడుమా - నీ తట్టు కన్నులెత్తుచున్నాను నేను నీ తట్టు కన్నులెత్తుచున్నాను ॥ఆకాశ॥
2.  గాయపడిన గొట్టెను నేను - బాగుచేయుమా పరమ వైద్యుడా కరుణించుమా యేసు కాపాడుమా - నీ తట్టు కన్నులెత్తుచున్నాను నేను నీ తట్టు కన్నులెత్తుచున్నాను ॥ఆకాశ॥
3.  పాప ఊబిలో పడియున్నాను- లేవనెత్తుమా నన్ను బాగుచేయుమా కరుణించుమా యేసు కాపాడుమా - నీ తట్టు కన్నులెత్తుచున్నాను నేను నీ తట్టు కన్నులెత్తుచున్నాను ॥ఆకాశ॥