← కీర్తనలు

866. స్తోత్రింతుము నిను మాదు తండ్రి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
స్తోత్రింతుము నిను మాదు తండ్రి సత్యముతో ఆత్మతోనెపుడు (2) పరిశుద్ధాలం..కారములతో దర్శించెదము - శరణం శరణం (2) స్తోత్రింతుము నిను మాదు తండ్రి సత్యముతో ఆత్మతోనెపుడు
1.  శ్రేష్ఠ యీవుల యూట నీవే - శ్రేష్ఠ కు-మారుని యిచ్చినందున (2) త్రిత్వమై యేకత్వమైన (యేకత్వమైత్రి) - (త్రి)లోకనాథా, శరణం శరణం (2) ||స్తోత్రింతుము||
2.  పాపి మిత్రుడ, పాపనాశక- పరమ వాసా, ప్రేమా పూర్ణా (2) వ్యోమ పీఠుడా, స్వర్ణమయుడా - పరిశుద్ధాంగుడా, శరణం శరణం (2) ||స్తోత్రింతుము॥
3.  ధవళ వర్ణుడా, రత్న వర్ణుడా సత్య రూపియన బడువాడా (2) నను రక్షించిన రక్షకుండా - నాథా నీవే, శరణం శరణం (2) ॥స్తోత్రింతుము॥
4.  సంఘమునకు శిరస్సునీవే - రాజానీకే నమస్కారములు (2) ముఖ్యమైన మూలరాయి - కోట్లకొలది - శరణం శరణం (2) ॥స్తోత్రింతుము॥
5.  నీదు సేవకుల పునాది - జ్ఞానమునకు మించిన తెలివి (2) అందముగను కూడుకొనుచు - వేడుకొందుము - శరణం శరణం (2) ॥స్తోత్రింతుము॥
6.  రాజా నీకే స్తుతిస్తోత్రములు - గీతములు మంగళ ధ్వనులు శుభము (2) శుభము శుభము నిత్యము హల్లెలూయ ఆమేన్ ఆమేన్ (2) ॥స్తోత్రింతుము॥
స్తోత్రింతుము నిను మాదు తండ్రి సత్యముతో ఆత్మతోనెపుడు (2) పరిశుద్ధాలం..కారములతో దర్శించెదము - శరణం శరణం (2) స్తోత్రింతుము నిను మాదు తండ్రి సత్యముతో ఆత్మతోనెపుడు
1.  బంగరు వెంట్రుకలు తలపై- ఉంగరములుగ కనబడుచున్నది (2) వేలలో అతి కాంక్షనీయుడా - వేలకొలది, శరణం శరణం (2) ॥స్తోత్రింతుము||
2.  గువ్వల వంటి ఆ కన్నులు- పువ్వుల వంటి చెక్కిళ్ళు (2) మంచి రూపము కల్గినందున - మాకు నీవే, శరణం శరణం (2) ||స్తోత్రింతుము॥
3.  చేతులు బంగారు మయము - చెక్కిన రత్నముల వంటివి (2) కాళ్ళు రాతి స్థంబమువలె - కన్పడుచున్నందున, శరణం శరణం (2) ||స్తోత్రింతుము||