← కీర్తనలు

864. స్తోత్రించి, కీర్తింతుము - ఘనపరచెదము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
స్తోత్రించి, కీర్తింతుము ఘనపరచెదము - కొనియాడెదము ఆదరించి - కాపాడువాడు యీడేర్చువాడు (2) ||స్తోత్రించి కీర్తింతుము||
1.  మనకింత వరకు సహాయపడెన్ - తానప్పగిం-చుకొనే మనకై (2) మనల నడిపెను - సుఖముగను - తనదు సత్యము నేర్పించి కనుపాపగ కాచెన్ ఆ. ఆ. ఆ. తనదు సత్యము నేర్పించి కనుపాపగ కాచెన్ ||స్తోత్రించి||
2.  ఈ ధరలోని నరులలో యథార్థ హృదయులకు (2) ముదమున తన చి-త్తము తెలుపన్ పదిలముగా ప్రభు కన్నులు... పృధివిని పరుగెత్తున్ ఆ. ఆ. ఆ. పదిలముగా ప్రభు కన్నులు... పృధివిని పరుగెత్తున్ ||స్తోత్రించి||
3.  అన్ని సమయ-ములలో కన్నులతో బోధించును నన్ను మార్చెను తప్పినన్ పన్నుగ హృదయము నాదరించె అన్న గురు యేసు ఆ. ఆ. ఆ. పన్నుగ హృదయము నాదరించె అన్న గురు యేసు ||స్తోత్రించి||
4.  అగ్నివంటి కన్నులు విఘ్నముల నుండి విడిపించున్ తగిన సహాయము చేయును ఎక్కాలమందును కునకవు మక్కువ పిల్లలకు ఆ. ఆ. ఆ. ఎక్కాలమందును కునకవు మక్కువ పిల్లలకు ||స్తోత్రించి||
5.  హాగరును చూచిన కన్నులు అనేకుల చూచెను ఇశ్రాయేలును కనికరించె ఎజ్రాకు సహాయపడెన్ నిద్రించవు నెప్పుడు ఆ. ఆ. ఆ. ఎజ్రాకు సహాయపడెన్ నిద్రించవు నెప్పుడు || సోత్రించి||
6.  నీతిమంతు-ల జూచి - జూచె దాది బోలె (దాదివలె) కాచెను జ్యోతులవలె నుండును అతిబలమిచ్చును అవసరతన్ క్షితి నిన్ను విడువడు ఆ. ఆ. ఆ. అతిబలమిచ్చును అవసరతన్ క్షితి నిన్ను విడువడు ||స్తోత్రించి||
7.  ఏడు కన్నులు - గలవాడునేడు నాడు కాపాడున్ ఎడతెగని చెడుగుల బాపున్ తేడుల నేర్పరచువాడుపాడుడి హల్లెలూయ ఆ.ఆ.ఆ. తేడుల నేర్పరచువాడు పాడుడి హల్లెలూయ ||స్తోత్రించి||