← కీర్తనలు

863. సాటిలేనిది యేసుని రక్తము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
సాటిలేనిది యేసుని రక్తము- పాపమును కడుగును ప్రియుడా - పాపమును కడుగును (2)
1.  చూడుము సోదరా దేవుడు ఎంతో - ప్రేమించె నీ జగతిన్ ప్రియుడా - ప్రేమించె నీ జగతిన్ (2) సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు (2) యేసుని పంపెను... ప్రియుడా - యేసుని పంపెను ॥సాటిలేనిది॥
2.  లోకమున కరుదెంచి క్రీస్తు ప్రభువు - ప్రాణము బలిగా నిచ్చె ప్రియుడా - ప్రాణము బలిగా (2) నిచ్చె లోక పాపమెల్ల సిలువలో మోసి (2) తొలగించె శాపముల్.. ప్రియుడా - తొలగించే శాపముల్ ॥సాటిలేనిది॥
3.  వినుము సోదరా ప్రభు యేసు క్రీస్తుని - పరలోక వార్తను ప్రియుడా - పరలోక వార్తను (2) ఉన్నతమైన పరలోక ప్రేమను (2) చాటించు చుంటిమి... ప్రియుడా - చాటించు చుంటిమి ॥సాటిలేనిది॥
4.  యేసుని నీవు క్షమించుమని వేడు - విరిగిన హృదయముతో ప్రియుడా - విరిగిన హృదయముతో (2) యేసుని అమూల్య రక్తధారలే (2) కడుగును పాపమెల్ల... ప్రియుడా - కడుగును పాపమెల్ల ॥సాటిలేనిది॥
5.  పాప భారమును మోసికొని నీవు - ప్రయాస మొందెదవా ప్రియుడా - ప్రయాస మొందెదవా (2) పాప మొప్పుకొని యేసు పాదముల (2) చెంతకు చేరుము... ప్రియుడా - చెంతకు చేరుమా ॥సాటిలేనిది॥
6.  గతించు చున్నది స్వల్ప జీవితము - శీఘ్రముగా (రా) రమ్ము ప్రియుడా - శీఘ్రముగా రమ్ము (2) కర్త యేసు నందు విశ్వాసముంచి (2) రక్షణ పొందుము... ప్రియుడా - రక్షణ పొందుము ॥సాటిలేనిది॥
7.  కృప, ఆనందము, పవిత్ర ప్రేమలో - భాగము పొందుము ప్రియుడా - భాగము పొందుము (2) పాప సాగరము దాటించగలడు (2) యేసు రక్షకుడే... ప్రియుడా - యేసు రక్షకుడే ॥సాటిలేనిది॥