పల్లవి:
సిలువలో సాగింది యాత్రా - కరుణామయుని దయగల పాత్ర (2)
ఇది ఎవరికోసమో... ఈ జగతి కోసమే - ఈ జనుల కోసమే ||సిలువలో||
1. పాలు కారు దేహము పైన - పాపాత్ముల కొరడాలెన్నో (2)
నాట్యమాడినాయి - నడివీధిలో నడిపాయి (2)
నోరు తెరువలేదాయె ప్రేమా - బదులు పలుకలేదాయె ప్రేమా ॥ఇది ఎవరి॥
2. వెనుక నుంచి తన్నింది ఒకరు - తన ముందు నిలచి నవ్వింది మరియొకరు (2)
గేలి చేసినారు - పరిహాసమాడినారు (2)
నోరు తెరువలేదాయె ప్రేమా - బదులు పలుకలేదాయె ప్రేమా ॥ఇది ఎవరి॥
3. చెళ్ళుమని కొట్టింది ఒకరు - అమోముపైన ఊసింది మరి యొకరు (2)
బంతులాడినారు - బాధలలో వేసినారు (2)
నోరు తెరువలేదాయె ప్రేమా బదులు పలుకలేదాయె ప్రేమా ॥ఇది ఎవరి॥
4. దాహమని అడిగింది ప్రేమా- చేదు దాహం ఇచ్చింది లోకం
చిరకనిచ్చినారు - మరి భరిసెతో గుచ్చారు (2)
నోరు తెరువలేదాయె ప్రేమా బదులు పలుకలేదాయె ప్రేమా ॥ఇది ఎవరి॥