← కీర్తనలు

861. సిలువలో బలియైన - దేవుని గొఱ్ఱపిల్ల

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
సిలువలో బలియైన - దేవుని గొఱ్ఱపిల్ల విలువైన నీ ప్రేమన్ - వివరింతున్ శ్రీ యేసు
1.  ఆనాటి యూదులే నిను జంపి రనుకొంటిన్ కాదు కాదయ్యయ్యో - నా పాప ఋణమునకే ॥సిలువలో॥
2.  నా యతిక్రమములకై - నలుగ గొట్టబడి నా దోషముల నీవు - ప్రియముగను మోసితివా ॥సిలువలో॥
3.  మృదువైన నీ నుదురు ముండ్ల పోట్లచేత సురూపమును లేక - సోలి పోతివా ప్రియుడా ॥సిలువలో॥
4.  నా రోగములు నీపై - నమ్రతతో భరియించి తృణీకరింపబడి - ప్రాణ మర్పించితివి ॥సిలువలో॥
5.  వ్యసనా క్రాంతుడవుగా - వ్యాధి ననుభవించి మౌనము ధరించి – మరణమైతివా ప్రభువా ॥సిలువలో॥
6.  నా పాప దోషముచే - నే చచ్చి యుండగనే మరణమై నా కొరకు - మరి తిరిగి లేచితివి ॥సిలువలో॥
7.  పరమున కెత్తబడిన - ప్రియ యేసూ నీ రాకడకై పదిలముగ కనిపెట్టి - పాడెదను హల్లెలూయ ॥సిలువలో॥