← కీర్తనలు

860. లెక్కింపలేని స్తోత్రముల్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
లెక్కించలేని స్తోత్రముల్ - దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2) - ఇంత వరకు నా బ్రతుకులో (2) నువ్వు చేసిన మేళ్ళకై ||లెక్కించలేని||
1.  ఆకాశ మహాకాశముల్ - దాని క్రిందున్నా ఆకాశము (2) భూమిపై కనబడునవన్ని - ప్రభువా నిన్నే కీర్తించున్ (2) ||లెక్కించలేని||
2.  అడవిలో నివసించువన్ని - సుడిగాలియు, మంచును (2) భూమిలో ఉన్నవి అన్ని - దేవా నిన్నే పొగడును (2) ||లెక్కించలేని||
3.  నీటిలో నివసించు ప్రాణుల్ - ఈ భువిలోన జీవ రాసులు (2) ఆకాశమున ఎగురునవన్ని - ప్రభువా నిన్నే కీర్తించున్ (2) ||లెక్కించలేని|| లెక్కించలేని స్తోత్రముల్ - దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2) - ఇంత వరకు నా బ్రతుకులో (2) నువ్వు చేసిన మేళ్ళకై ||లెక్కించలేని||
లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ నీ మహిమలన్ నీ మేళ్ళను తలపోసి కీర్తించెదన్ ఆహా ॥
1.  ఆకాశ హర్మ్యముల్ అంబరములనె- చుంబించెగా (2) నీ కీర్తి ఘనత ప్రభావమ్ పరలోక పరిధులనే దాటెన్ - ఆహా ||లెక్కింప॥
2.  నీ దివ్య సృష్టి సౌందర్యం మమ్ముమైమరువజేసె ప్రభువా(2) నీ మధుర మృదు మంజుల స్వరము నిలువెల్ల పులకింపజేసెన ఆహా ||లెక్కింప॥
3.  నీ ప్రేమామృత హృదయం - మాదుడెందములన్ అలరించెగా (2) భువనైక మోహనంబు అసమాన నీ దివ్యస్వరూపం - ఆహా ||లెక్కింప॥