← కీర్తనలు

859. సందేహమేల - సంశయ మదేల

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
సందేహమేల సంశయమదేల - ప్రభు యేసు గాయములను పరికించి చూడు గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు (2) ||సందేహమేల||
1.  ఆ ముళ్ల మకుటము నీకై – ధరియించెనే నీ పాప శిక్షను తానే – భరియించెనే (2) ప్రవహించె రక్త ధార నీ కోసమే కడు ఘోర హింసనొందె నీ కోసమే (2) ||సందేహమేల||
2.  ఎందాక యేసుని నీవు – ఎరగనందువు ఎందాక హృదయము బయట – నిలవమందువు (2) యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా (2) ||సందేహమేల||
3.  ఈ లోక భోగములను – వీడజాలవా సాతాను బంధకమందు – సంతసింతువా (2) యేసయ్య సహనముతోనే చెలగాటమా ఈనాడు రక్షణ దినము గ్రహియించుమా (2) ||సందేహమేల||
4.  లోకాన ఎవ్వరు నీకై – మరణించరు నీ శిక్షలను భరియింప – సహియించరు (2) నీ తల్లియైన గాని నిన్ను మరచునే ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా (2) ||సందేహమేల||