← కీర్తనలు

858. రుచి చూచి యెరిగితిని

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
రుచి చూచి యెరిగితిని యెహోవా ఉత్తముడనియు (2) రక్షకు..నాశ్రయించి – నే ధన్యుడనైతిని (2) ॥రుచి||
1.  గొప్ప దేవుడవు నీవే – స్తుతులకు పాత్రుడ నీవే (2) తప్పక ఆరాధింతున్ – దయాళుడవు నీవే (2) || రుచి చూచి||
2.  మహోన్నతుడవగు దేవా – ప్రభావము గలవాడా(2) మనసార పొగడెదను నీ – ఆశ్చర్యకార్యములన్ (2) || రుచి చూచి||
3.  మంచితనముగల దేవా – అతి శ్రేష్టుడవు అందరిలో(2) ముదమార పాడెద నిన్ను- అతి సుందరడవనియు (2) || రుచి చూచి||
4.  కృతజ్ఞతచెల్లింతున్ – ప్రతి దాని కొరకు నేను (2) క్రీస్తుని యందే తృప్తి – పొంది హర్షించెదను (2) || రుచి చూచి||
5.  ప్రార్థింతును ఎడతెగక – ప్రభు సన్నిధిలో చేరి (2) సంపూర్ణముగ పొందెదను – అడుగువాటన్నిటిని (2) || రుచి చూచి||
6.  నా జీవిత మంతయును - యెహోవాను స్తుతియించెదను (2) నా బ్రతుకు కాలములో - నా దేవుని కీర్తింతున్(2)॥రుచి||
7.  సంతోషింతు నెల్లప్పుడు - కష్ట దుఃఖ బాధలలో (2) ఎంతో నెమ్మదినిచ్చు - నా రక్షకుడు నా యేసు (2) |॥రుచి॥