పల్లవి:
రాకడ సమయములో - కడబూర శబ్దముతో
యేసుని చేరుకొనే - విశ్వాసము నీకుందా (2)
రావయ్యా యేసయ్యా - వేగరావయ్యా రావయ్యా
రావయ్యా యేసునాథా - వేగమే రావయ్యా ॥రావయ్యా||
1. యేసయ్య రాకడ సమయంలో - ఎదురేగే రక్షణ నీకుందా?(2)
లోకాశలపై విజయము నీకుందా? (2) ॥రావయ్యా॥
2. ఇంపైన దూప వేదికగా - ఏకాంత ప్రార్థన నీకుందా? (2)
యేసుని ఆశించే దీన మనస్సుందా? (2) ॥రావయ్యా॥
3. దినమంతా దేవుని సన్నిధిలో - వాక్యం కొరకు ఆకలి నీకుందా? (2)
యేసు నాథునితో సహవాసం నీకుందా (2) ॥రావయ్యా||
4. శ్రమలోన సహనం నీకుందా - స్తుతియించే నాలుక నీకుందా? (2)
ఆత్మల కొరకైన భారం నీకుందా?”” ॥రావయ్యా॥
5. నీ పాత రోత జీవితము - నీ ఘోర హృదయం మారిందా? (2)
నూతన హృదయంతో ఆరాధన నీకుందా? (2) ॥రావయ్యా||
6. అన్నిటి కన్న మిన్నగా- కన్నీటి ప్రార్థన నీకుందా? (2)
ఎల్లవేళలలో స్తుతియాగం నీకుందా? (2) ॥రావయ్యా॥
