← కీర్తనలు

855. యేసు చావొందే సిలువలో

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసు చావొందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమ నోర్చెను నీ కొరకే నా కొరకే
1.  నదివలె యేసు రక్తము - సిలువలోనుండి ప్రవహించె(2) పాపము కడిగె - మలినంబు తుడిచె - ఆ ప్రశస్త రక్తమే ||యేసు||
2.  నేడే నీ పాపము లొప్పుకో - నీ పాపడాగులు తుడుచుకో (2) నీ ఆత్మ తనువుల - శుద్ధిపరచుకో - క్రీస్తుయేసు రక్తములో (2) ||యేసు||
3.  పాప శిక్ష పొంద తగియుంటిమి - మన శిక్ష ప్రభువే సహించెను(2) నలుగగొట్టబడే పొడువబడె నీకై - అంగీకరించు యేసుని (2) ॥యేసు॥