← కీర్తనలు

854. యేసు రాజుగా వచ్చుచున్నాడు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసు రాజుగా వచ్చుచున్నాడు - భూలోకమంతా తెలుసుకొంటారు (2) రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2) - రారాజుగా వచ్చు చున్నాడు (2) ||యేసు||
1.  మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు - పరిశుద్దులందరిని తీసుకుపోతాడు (2) లోకమంతా శ్రమకాలం (2) - విడువబడుట బహుఘోరం (2) ||యేసు||
2.  ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది - ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది (2) ఈ సువార్త మూయబడున్ (2) - వాక్యమే కరువగును (2) ||యేసు||
3.  వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలున - ఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలును (2) నీతి శాంతి వర్ధిల్లును (2) - న్యాయమే కనబడును (2) ||యేసు||
4.  ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర - సాగిలపడి నమస్కరించి గడగడలాడును (2) వంగని మోకాళ్ళన్నీ (2) - యేసయ్య యెదుట వంగిపోవును (2) ||యేసు||
5.  క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడ - కనిపెట్టి ప్రార్ధనచేసి సిద్ధముగానుండు (2) రెప్ప పాటున మారాలి (2) - యేసయ్య చెంతకు చేరాలి (2) ||యేసు||