← కీర్తనలు

850. మనకై యేసు మరణించే

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
మనకై యేసు మరణించే - మన పాపములకొరకే నిత్యజీవము నిచ్చుటకే - సత్యుండు సజీవుడాయే
1.  తృణీకరింపబడె - విసర్జింపబడెను దుఃఖాక్రాంతుడాయె - వ్యసనముల భరించెను ॥మనకై॥
2.  మన వ్యసనముల వహించెన్ - మన దుఃఖముల భరించెన్ మన మెన్నిక చేయకయే - మన ముఖముల ద్రిప్పితిమి ॥మనకై॥
3.  మన యతిక్రమముల కొరకు - మన దోషముల కొరకు మన నాథుడు శిక్షనొందె - మనకు స్వస్థత కలిగె ॥మనకై॥
4.  గొర్రెలవలె తప్పితిమి పరుగిడితిమి మన దారిన్ అరుదెంచె కాపరియై - అర్పించె ప్రాణమును ॥మనకై॥
5.  దౌర్జన్యము నొందెను - బాధింపబడెను తన నోరు తెరువలేదు - మనకై క్రయధన మీయ్యన్ ॥మనకై॥
6.  ఎదిరింప లేదెవరిన్ లేదే కపటము నోట యెహోవా నలుగ గొట్టెన్- మహా వ్యాధిని కలిగించెన్ ॥మనకై॥
7.  సిలువలో వ్రేలాడెన్ - సమాధిలో నుండెన్ సజీవుడై లేచెన్ – స్తోత్రములు హల్లెలూయా ... ||మనకై||