← కీర్తనలు

849. మనకు జీవమైయున్న రక్షకుడు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
మనకు జీవమైయున్న రక్షకుడు ప్రభుయేసే (2)
1.  దేవుని దీవెనలు పొంద (2) యౌవనులారా... యేసుని ... సన్నిధికి రారండి(2) దైవ కుమారుడు పావన క్రీస్తుని - జీవము పొంది నడువుడి (2) ||మనకు||
2.  యేసు నంగికరించెడి వారి(2) పేరులు... జీవ... గ్రంధము నందు... వ్రాయబడున్(2) నమ్మకమైయున్న పావన క్రీస్తుని - జీవము పొంది నడువుడి ||మనకు||
3.  దేవుని స్వరూపము కల్గిన(2) యేసు... ప్రభు... మనుజరూపంబున... జన్మించెను(2) చావును గెల్చిన పావన క్రీస్తుని - జీవము పొంది నడువుడి ||మనకు||
4.  యేసు రక్తములో కడుగబడిన(2) తెల్లని... వస్త్రముల్... ధరియించి... రారండి(2) గొప్ప కృపానిధి పావన క్రీస్తుని - జీవము పొంది నడువుడి ||మనకు||
5.  క్రీస్తుయేసుని యౌవన జనమా (2) ఆయనకు... ప్రాణము... లర్పించను.. నిలువుడి (2) సత్యరూపియగు పావన క్రీస్తుని - జీవము పొంది నడువుడి ||మనకు||
6.  రాజులరాజు ప్రభుల ప్రభువు(2) అనుపేరు... ఆయన... వస్త్రముపై... వ్రాయబడెన్(2) సర్వశక్తి గల పావన క్రీస్తుని - జీవము పొంది నడువుడి ||మనకు||
7.  ప్రభుని పిలుపు పొందియున్న (2) యౌవనులార... విశ్వసించి... విజయము... పొందుడి (2) శత్రువు నోడించి యేసు నామమున - హల్లెలూయ పాట పాడుడి ||మనకు||