← కీర్తనలు

848. భాసిల్లెను సిలువలో పాప క్షమ

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
భాసిల్లెను సిలువలో పాప క్షమ యేసు ప్రభూ నీ దివ్య క్షమ ||భాసిల్లెను||
1.  కలువరిలో నా పాపము పొంచి - సిలువకు నిన్ను ఆహుతి చేసె కలుషహరా కరుణించితివా ||భాసిల్లెను||
2.  దోషము జేసినది నేనేకదా - మోసముతో బ్రతికిన నేనేకదా మోసితివా నా శాపభారం (2) ||భాసిల్లెను||
3.  పాపము చేసి గడించితి మరణం - శాపమేగా నే నార్జించినది కాపరివై .. నను బ్రోచితివి? (2) |॥భాసిల్లెను॥
4.  నీ మరణపు వేదన వృధాగాదు - నా మది నీ వేదనలో మునిగెను క్షేమము కలిగెను హృదయములో (2) ॥భాసిల్లెను||
5.  ఎందులకో నాపై ఈ ప్రేమ - అందదయ్యా స్వామీ నా మదికి అందులకే భయమొందితిని (2) ॥భాసిల్లెను॥
6.  నమ్మిన వారిని కాదన వనియు - నెమ్మది నొసగెడి నా ప్రభుడ వని నమ్మితి నీ పాదమ్ములను (2) ||భాసిల్లెను॥