← కీర్తనలు

847. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ప్రియ యేసు రాజును నే చూచిన చాలు - మహిమలోనే నాయనతో నుంటే మేలు = నిత్యమైన మోక్షగృహము నందు చేరి - భక్తుల గుంపులో హర్షించిన చాలు ॥ప్రియ॥
1.  యేసుని రక్తమందు కడుగబడి వాక్యముచే నిత్యం భద్రపరచబడి = నిష్కళంక పరిశుద్ధులతో పోదున్ నేను – బంగారు వీధులలో తిరిగెదన్ ||ప్రియ||
2.  దూతలు వీణలను మీటునపుడు - గంభీర జయధ్వనులు మ్రోగునపుడు = హల్లెలూయ పాటల్ పాడుచుండ - ప్రియ యేసుతోను నేను ఉల్లసింతున్ ॥ప్రియ||
3.  ముండ్ల మకుటంబైన తలను జూచి స్వర్ణ కిరీటం బెట్టి యానందింతున్ = కొరడాతో కొట్టబడిన వీపును జూచి ప్రతియొక్క గాయమును చుంబింతును ॥ప్రియ॥
4.  హృదయము స్తుతులతో నింపబడె నా భాగ్య గృహమును స్మరించుచుంటే = హల్లేలూయా ఆమేన్, హల్లేలూయ వర్ణింప నా నాలుక చాలదయ్యా ||ప్రియ॥
5.  ఆహా! యా బూర యెపుడు ధ్వనించునో - ఆహా! నా ఆశ యెపుడు తీరుతుందో = తండ్రి నా కన్నీటిని తుడుచు నెప్పుడో ఆశతో వేచియుండె నా హృదయము ॥ప్రియ॥