← కీర్తనలు

846. భజియింతుము నిను జగదీశా.

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
భజియింతుము నిను జగదీశా - శ్రీ - యేసా - మా రక్షణకర్త (2) శరణు, శరణు, మా దేవా యెహోవా మహిమాన్విత చిర జీవనిధి (2) ||భజియింతుము॥
1.  విమల సెరాపులు - దూత గణంబులు చూడగలేని తేజోనిధివే (2) మా యఘములకై సిలువ మ్రానిపై - దీనుడవై మరణించితివే ॥శరణు॥ (2)
2.  ప్రప్రథముడ మరి, కడపటివాడా- మృతుడై బ్రతికిన నిరత నివాసి (2) నీ భజనయే మా జీవాధారం- చే కొనవే మా స్తుతి ధూపం ॥శరణు॥