← కీర్తనలు

844. పరవాసినినే జగమున ప్రభువా

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
పరవాసినినే జగమున ప్రభువా - నడుచుచున్నాను నీ దారిన్ నా గురి నీవే నా ప్రభువా - నీ దరినే చేరెదను నేను - నీ దరినే చేరెదను
1.  లోకమంతా నాదని యెంచి - బంధు మిత్రులే ప్రియులనుకొంటిని (2) అంతయు మోసమేగా - వ్యర్థము సర్వము ఇలలో - వ్యర్థము సర్వమును ||పర||
2.  ధన సంపదలు, గౌరవములు - దహించిపోవు ఈ లోకములో (2) పాపము నిండె జగములో - శాపము చేకూర్చుకొనే - లోకము శాపము చేకూర్చుకొనే ॥పర||
3.  తెలుపుము నా అంతము నాకు - తెలుపుము నా ఆయువు యెంతో (2) తెలుపుము యెంత అల్పుడనో - విరిగి నలిగియున్నాను - నేను విరిగి నలిగియున్నాను ॥పర॥
4.  ఆ దినము ప్రభు గుర్తెరిగితిని - నీ రక్తముచే మార్చబడితిని (2) క్షమాపణ పొందితివనగా మహానందము కలిగె నాలో మహానందము కలిగె ॥పర॥
5.  యాత్రికుడనే యీ లోకములో - సిలువ మోయుచు సాగెద నిలలో (2) అమూల్యమైన ధనముగా - పొందితిని యేసును పొందితిని నేను ||పర||