← కీర్తనలు

842. నే సాగెద యేసునితో

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా (2)
1.  యేసుతో గడిపెద - యేసుతో నడిచెద పరమున చేరగనే – వెళ్ళెద, హనోకువలె సాగెదా ... ॥నే సాగెద॥
2.  తల్లియే మరచిన - తండ్రియే విడిచిన బంధువులే నన్ను వెలివేసినా - బలవంతునితో సాగెదా... ॥నే॥
3.  వెనుక శత్రువుల్ - వెంటాడినను ముందు సముద్రము ఎదురొచ్చినా- మోషేవలె సాగెదా ... ॥నే॥
4.  మరణ శాసనం - హెచ్చించినను సింహపు బోనులో నను వేసినా- దానియేలవలె సాగెదా... ॥నే॥
5.  లోకపు శ్రమలు - నన్నెదిరించినను కఠినులు రాళ్ళతో హింసించినా - సైఫనువలె సాగెదా ... ॥నే॥
6.  బ్రతుకుట క్రీస్తే చావైతె మేలే క్రీస్తుకే హతసాక్షిగా మారెద - పౌలువలె సాగెదా ... ॥నే సాగెదా॥