← కీర్తనలు

841. నీ వాక్యమే నన్ను బ్రతికించెను

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నిచ్చెను కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమైయున్న యేసు వందనమయ్యా ॥నీ వాక్యమే॥
1.  జిగటగల ఊబినుండి లేవనెత్తెను సమతలమగు భూమిపై నన్ను నిలబెట్టెను నా పాదములకు దీపమాయెను నిత్యమైన మార్గములో నన్ను నడిపించునూ ॥నీ వాక్యమే॥
2.  వాడిగల రెండంచుల ఖడ్గమువలెను నాలోని సర్వము విభజించి రక్షించి పాప మార్గమును తొలగించి వేయును అనుదినము క్రొత్త శక్తి నిచ్చుచున్నది ॥నీ వాక్యమే॥
3.  పాపములను తొలగించు సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధమనసు నిచ్చుచున్నది అపవాదివేయుచున్న అగ్ని బాణము ఖడ్గమువలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది ॥నీ వాక్యమే॥