← కీర్తనలు

840. నీవు చేసిన ఉపకారములకు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును (2) ఏడాది దూడలనా? - వేలాది పొట్టేళ్ళనా? (2) ॥నీవు|
1.  వేలాది నదులంత విస్తార తైలము - నీకిచ్చినా చాలునా? (2) గర్భఫలమైన నా జ్యేష్టపుత్రుని- నీ కిచ్చినా చాలునా? (2) ||నీవు॥
2.  మరణ పాత్రుడనైయున్న నాకై మరణించితివి సిల్వలో (2) కరుణ జూపి నీ జీవ మార్గాన - నడిపించుమో యేసయ్యా (2) ॥నీవు॥
3.  విరిగి నలిగిన బలియాగముగను నా హృదయ మర్పింతును (2) రక్షణ పాత్రను చేబూని నిత్యము నిను వెంబడించెదను (2) ||నీవు||
4.  ఈ గొప్ప రక్షణ నా కిచ్చినందుకు - నేనేమి చెల్లింతును? (2) కపట నటనాలు చాలించి హృదయాన్ని- నీకిచ్చినా చాలునా? (2) ||నీవు||