← కీర్తనలు

839. నీ రక్తమే - నన్ శుద్ధీకరించున్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నీ రక్తమే – నీ రక్తమే - నన్ శుద్ధీకరించున్ - నీ రక్తమే నా బలము
1.  నీ రక్తధారలే యిల పాపి కాశ్రయం బిచ్చును పరిశుద్ధ తండ్రి పాపిని - కడిగి పవిత్రపరుచును ||నీ రక్తమే||
2.  నశించువారికి నీ సిలువ - వెర్రితనముగా నున్నది రక్షింపబడుచున్న పాపికి - దేవుని శక్తియైయున్నది ॥నీ రక్తమే॥
3.  నీ సిల్వలో కార్చినట్టి - విలువైన నీ రక్తముచే పాప విముక్తి చేసితివి - పరిశుద్ధ దేవ తనయుడా ॥నీ రక్తమే॥
4.  పంది వలె పొర్లిన నన్ను - కుక్కవలె తిరిగిన నన్ను ప్రేమతో చేర్చుకొంటివి - ప్రభువా నీకే స్తోత్రము ॥నీ రక్తమే॥
5.  నన్ను వెంబడించు సైతానున్ నన్ను బెదరించు సైతానున్ దును మాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే ॥నీ రక్తమే॥
6.  స్తుతి మహిమ ఘనతయు - యుగ యుగంబులకును స్తుతి పాత్ర నీకే చెల్లును - స్తోత్రార్హుడ నీకే తగును ॥నీ రక్తమే॥