← కీర్తనలు

838. నీతో సమమెవరు?

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు? యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరూ? (2)
1.  వెండి బంగారము ధన ధాన్యాలలో - ఒక్కటై పోగేసిన నీతో సరితూగునా (2) = జీవనదులన్నియూ సర్వ సముద్రములు - ఒక్కటై ఎగిసిన నిన్ను తాకగలవా - నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి నీవేగా మంచి దేవుడు (2) ॥నీతో॥
2.  పలు వేదాలలో మత గ్రంథాలలో - పావనేసుకన్న పరిశుద్ధుడెవరు (2) పాప పరిహారము సిలువ మరణమొంది - తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరూ - నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా నీవేగా విమోచకుడు ॥నీతో॥
3.  నేను వెదకకున్నా నాకు దొరికితివి - నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి (2) = నీకు గాయాలు చేసి తరచు రేపితిని నన్నెంతో సహించి క్షమించితివి = లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించినా నీవేగా చాలిన దేవుడు (2) ॥నీతో॥